BREAKING
గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి రామన్నపేటలో చేయూత పింఛన్ల పంపిణీ వైభవంగా తులసి మాత కళ్యాణ మహోత్సవాలు పెద్దకొత్తిలి సర్పంచ్ గా యంకమ్మ ఏకగ్రీవం ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి - మల్కాపూర్ లో సుడా మాజీ చైర్మన్ కేఎన్ఆర్ మార్నింగ్ వాక్ మంత్రి హామీతో మెడికోల నిరసన విరమణ ఫూలే దంపతుల పోరాట గాథ.. నవంబర్ 27న తెలుగులో రిలీజ్ కానున్న 'ఫూలే రిపబ్లిక్ డే క్యాంపునకు అల్ఫోర్స్ విద్యార్థిని లాస్య ఎంపిక వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై తెదేపాలో రచ్చ...! ఫూలే దంపతుల పోరాట గాథ.. నవంబర్ 27న తెలుగులో రిలీజ్ కానున్న 'ఫూలే నన్నూరులో 16 వార్డులు ఏకగ్రీవం.. సర్పంచ్ బరిలో ఇద్దరు అభ్యర్థులు!** కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్విత విద్యార్థుల పతకాల పంట శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో కార్తీక పౌర్ణమి యజ్ఞం అంతర్జాతీయ మేయర్ల సదస్సుకు కరీంనగర్ మేయర్‌కు ఆహ్వానం 3వ వరల్డ్ మేయర్స్ ఫోరం 2026లో పాల్గొననున్న గుంటూరు మేయర్, కమిషనర్

సెమీస్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఎ!

Select Suryaa Now
సెమీస్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఎ!

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో ఇండియా-ఎ జట్టు సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. కీలక మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి బౌలర్లపై ఊచకోత కోశాడు. ఏకంగా 28 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో 204 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచాడు. అతని సుడిగాలి ఇన్నింగ్స్ దెబ్బకు భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.

ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డుల సునామీ సృష్టించాడు. కేవలం 28 బంతుల్లో సెంచరీ, 52 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేయడంతో పాటు.. లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ, 150 పరుగులు, డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒకే ఇన్నింగ్స్‌లో మూడు ఫాస్టెస్ట్ ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న వైభవ్‌పై క్రీడాభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.