BREAKING
మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి.. పల్లె మధుమోహన్ రెడ్డి పరమశివుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి - మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే లక్ష్యం. - చీఫ్ ఇంజినీర్ గాయత్రీ దేవి. నెల 26 న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు నూతన రైతులకు సొసైటీ ద్వారా రుణాలు అందిస్తాం మద్దికుంట నర్మదాకు మద్దతుగా టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం! లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు ఘన సన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి రామన్నపేటలో చేయూత పింఛన్ల పంపిణీ వైభవంగా తులసి మాత కళ్యాణ మహోత్సవాలు పెద్దకొత్తిలి సర్పంచ్ గా యంకమ్మ ఏకగ్రీవం ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి - మల్కాపూర్ లో సుడా మాజీ చైర్మన్ కేఎన్ఆర్ మార్నింగ్ వాక్

మంత్రి హామీతో మెడికోల నిరసన విరమణ

Select Suryaa Now
మంత్రి హామీతో మెడికోల నిరసన విరమణ
సూర్య కరీంనగర్‌ : కొత్తపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు మూడు రోజులుగా చేపట్టిన శాంతియుత నిరసనను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటనతో విరమించారు. బుధవారం నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు ప్రకటించారు. బాలికల హాస్టల్‌ను నవంబర్‌ చివరి నాటికి, బాలుర హాస్టల్‌ను డిసెంబర్‌ చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, వైద్య కళాశాల ప్రధాన భవనాన్ని మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంగళవారం అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ తఖీయూద్దీన్‌ ఖాన్‌, కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌ విద్యార్థులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. తాత్కాలిక కళాశాలలోనూ మౌలిక వసతులు కల్పిస్తామని, జిల్లా కలెక్టర్‌, మంత్రులు కళాశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా చదువుపై దృష్టి సారించాలని ప్రిన్సిపాల్‌, ఏసీపీ సూచించారు. ఈ సమావేశంలో కొత్తపల్లి సీఐ కోటేశ్వర్‌, తహసీల్దార్‌ లక్ష్మి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.