telangana
రామన్నపేటలో చేయూత పింఛన్ల పంపిణీ
సూర్య వేల్పూరు : రామన్నపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల ప్రొసీడింగ్ కాపీలను మంగళవారం గ్రామ సర్పంచ్ బేల్దారి నవీన్ మరియు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అర్హులైన పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, ఇతర అర్హత కలిగిన వారికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని తెలిపారు.నూతనంగా పింఛన్లు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు గ్రామ ప్రజలు, లబ్ధిదారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బేల్దారి నవీన్, ఉపసర్పంచ్ గోవర్ధన్, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు శోభన్ రెడ్డి, పొన్నాల చిన్నయ్య, పడకండి మోహన్ రెడ్డి, జంగిటి సాయన్న, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నితిన్, నితీష్, సాగర్, గిరీష్, తెడ్డు భూమేశ్వర్, డాక్టర్ కిషన్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.