BREAKING
వెంకన్న నిత్య అన్నదాన పథకానికి విరాళాలు విలువ కార్తీక పౌర్ణమి వేళ నృసింహ క్షేత్రానికి భక్తజనసంద్రం - 9వ గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు పకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన యువత క్రీడాల్లో రాణించాలి చిట్టమూరు సర్పంచ్‌గా గణపర్తి సుశీలమ్మ ఏకగ్రీవం గ్రామ ప్రజల ఏకాభిప్రాయం.. 10 వార్డులూ ఏకగ్రీవం ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ గ్రామాభివృద్ధే లక్ష్యం: గణపర్తి కిషోర్ నాయుడు 10 గ్రామపంచాయతీలలో ఎన్నికలు షురూ..! కుటుంబ బాధ్యతలను ఆవిష్కరించిన మరాఠీ చిత్రం ఆది అనంత్ జంగంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, శిరోమణి అకాలీదళ్ పునరేకీకరణ కన్నుల పండవగా శ్రీ గండి వెంకటేశ్వర స్వామి  కల్యాణోత్సవం ఇఫీ 2026 వేదికగా సార్వత్రిక మానవ కోరికలను ఆవిష్కరించిన ఈజిప్టు చిత్రం ది బ్లాక్ సీ ఎదురుగట్లలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు రకాబ్ గంజ్ సాహిబ్ గురుద్వారాలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రత్యేక ప్రార్థనలు గ్రామాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేయాలి

సాంబిరెడ్డి సేవలు అభినందనీయం

Select Suryaa Now
సాంబిరెడ్డి సేవలు అభినందనీయం

 

సాంబిరెడ్డి సేవలు స్ఫూర్తిదాయకం

  గుంటూరు రూరల్, మేజర్ న్యూస్:

 గుంటూరు స్తంభాలగరువు అనవేమా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉడుముల కోటిరత్నం సాంబిరెడ్డి బాలికల వసతి గృహం నూతన భవనంలో మంగళవారం విద్యార్థుల ప్రవేశం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఉడుముల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ… సామాన్య రైతు కుటుంబం లో పుట్టి పెరిగిన ఉడుముల సాంబిరెడ్డి పెద్దగా చదువుకోకపోయినా ఆదర్శ భావాలతో ..ఉన్నత విద్యను అభ్యసించే పేద మధ్యతరగతి ఆడపిల్లల కోసం 2004 సంవత్సరం లో తన సొంత స్థలం లో పది లక్షలు వెచ్చించి పది గదులతో వసతి గృహం నిర్మాణం చేపట్టారు. అనంతర కాలంలో 2007 మరణించిన తరువాత కోటిరత్నం భర్త ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తూ వసతి గృహం అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూరుస్తున్నారు.  దాతల సహకారంతో నేడు దాదాపు 600 మంది విద్యార్థినులకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా నాణ్యమైన ఆహారం, మంచి వసతి అందిస్తున్నామని పేర్కొన్నారు. ట్రస్ట్ సెక్రటరీ మున్నంగి సంజీవ రెడ్డి మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం ఉడుముల సాంబిరెడ్డి వర్ధంతి సందర్భంగా  సేవా స్ఫూర్తితో దాతలు ముందుకు వచ్చి అందిస్తున్న సహకారంతో కుల మతాలకు అతీతంగా విద్యలో ప్రతిభ కనబరిచిన  వంద మంది విద్యార్థులకు పదిలక్షల రూపాయల నగదు స్కాలర్ షిప్స్ అందజేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు ఆధునిక డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు  చేశామని , విద్యార్థునుల భద్రత, సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ట్రస్ట్ పాలకమండలి గౌరవ అధ్యక్షులు కుర్రి సాంబిరెడ్డి, ప్రెసిడెంట్ గుంటూరు వేమారెడ్డి, కోశాధికారి ఒంటెద్దు ఓబుల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ మారెడ్డి శ్రీనివాస రెడ్డి, సభ్యులు మున్నంగి సాంబిరెడ్డి, కుర్రి పుల్లారెడ్డి, ఉడుముల శివారెడ్డి , గొర్ల శ్రీనివాస రెడ్డి, ట్రస్ట్ సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. 

ఆళ్ల వీరభద్రరావు, సీనియర్ జర్నలిస్ట్