బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు.
బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు. పెడన, మేజర్ న్యూస్: పురపాలక సంఘం పాలకులు నేడు బాధ్యతలు స్వీకరించేందుకు ప్రమాణస్వీకారాలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గా బళ్ళ జ్ఞాన లింగజ్యోత్స్నరాణి, వైస్ చైర్మన్ గా అజీమ్ కూటమి ప్రభుత్వ,వైసీపీ కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం ముందు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలసోరి స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ దగ్గరుండి ప్రమాణ స్వీకారాలను పర్యవేక్షించారు. ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో విజయం సాధించిన అభ్యర్థులు ప్రమాణస్వీకారాన్ని చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మరియు కార్యాలయ సిబ్బంది కూటమి ప్రభుత్వ నాయకులు తదితరులు ఉన్నారు.