మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి.. పల్లె మధుమోహన్ రెడ్డి
మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి.. పల్లె మధుమోహన్ రెడ్డి విజ్ఞప్తి!
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
ఓర్వకల్లు మండల పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పల్లె మధుమోహన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు తనకు ఒక్క అవకాశం కల్పించి మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ, అందరి సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.