నెల 26 న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు
నెల 26 న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు
*ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రదేశాలలో భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పి తో కలసి ఏ ఎస్ ఎల్ నిర్వహించిన జిల్లా కలెక్టర్
*అధికార యంత్రాంగం సమన్వయంతో విజయవంతం చేయండి
*జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 26న తిరుమల పర్యటనకు రానున్నారని, అధికార యంత్రాంగం సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు.
మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని విసి హాల్ నందు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్ల పై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రదేశాలలో జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడుతో కలసి ఎ ఎస్ ఎల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా నవంబర్ 26న గురువారం ఉదయం 10 గం.లకు తిరుపతి పట్టణంలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారన్నారు. అనంతరం ముఖ్యమంత్రి ఉదయం 10.45 గం.లకు తిరుమల గాయత్రి గెస్ట్ హౌస్ చేరుకుని, 11.10 గం.లకు శ్రీ వారి దర్శనానికి వెళతారన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం మధ్యాహ్నం 12.45 గం.లకు తిరుమల నుండి బయల్దేరి తిరుపతి అగ్రికల్చర్ యూనివర్సిటీ చేరుకుని మధ్యాహ్నం 1.30 గం.లకు హెలికాప్టర్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం బయల్దేరి వెళ్లనున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ ఏర్పాటు, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, తదితర ఏర్పాట్ల పై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో తిరుపతి ఆర్ డి ఓ రామ్మోహన్, అడిషనల్ ఎస్ పి లు రామకృష్ణ, శ్రీనివాస రావు, డి ఎం అండ్ హెచ్ ఓ బాలకృష్ణ నాయక్, ఆర్ అండ్ బి ఎస్ ఈ రాజా నాయక్, జిల్లా రవాణా అధికారి మురళి మోహన్, డీస్పీ లు, సీఐ లు, ఎస్సై లు భద్రతా విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,