BREAKING
లంబాడిగూడ జై హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం తొలిసారిగా ఘనీభవించిన బఠాణీ, మిశ్రమ కూరగాయల ఎగుమతి ప్రారంభం శాయిన్ పేటలో ఉచిత ఆర్థోపెడిక్ జనరల్ క్యాంప్ విజయవంతం సాంబిరెడ్డి సేవలు అభినందనీయం టీజీవీపీ నూతన మండల కమిటీ ఎన్నిక ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యం.. 56 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన బ్యాంకు శాంతమ్మ శ్రీ లక్షినరసింహ స్వామి జాతరకు తరలి వెళ్తున్న యువకులు మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి.. పల్లె మధుమోహన్ రెడ్డి పరమశివుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి - మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే లక్ష్యం. - చీఫ్ ఇంజినీర్ గాయత్రీ దేవి. నెల 26 న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు నూతన రైతులకు సొసైటీ ద్వారా రుణాలు అందిస్తాం మద్దికుంట నర్మదాకు మద్దతుగా టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం!

ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు

Select Suryaa Now
ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు

 

లింగాల : మండల కేంద్రమైన లింగాలలోని ఎంతో ప్రశస్థి గల హనుమాన్ దేవాలయంలో కార్తీక మాసం దీపారాధన పూజలు  సాంప్రదాయ రీతిలో ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం అత్యంత ప్రాధాన్యత గల కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని
సామూహిక దీపారాధన ప్రదర్శనలు, అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో ప్రశస్థి గల శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఉసిరి చెట్టు కింద
సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూజారి సుదర్శనచార్యులు వేద మంత్రాల మధ్య భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి సుదర్శన చార్యులు
మాట్లాడుతూ. పవిత్రమైన కార్తిక మాసం పురస్కరించుకొని భక్తులు ఉదయం, సాయంత్రం వేళలో హనుమాన్ మార్కండేయ ఆలయాలలో దీపారాధన, ప్రత్యేక
పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు మహిళలు, చిన్నారులు, భక్తులు ఆలయంలో దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని శివునికి అభిషేకాలు, అర్చనలు,
ఆకాశ దీపోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి రోజు రాత్రివేళలో హనుమాన్ ఆలయంలో భక్తులు ఆకు పూజ కార్యక్రమం, భజన పరులు భక్తి గీతాలాపన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం కోదండరామ స్వామి ఆలయ సమీపంలోని చెరువులో మహిళలు, భక్తులు కార్తీక పౌర్ణమి తెప్పోత్సవంలో
ప్రమిదలను వదిలారు.