telangana
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
సూర్య, పెంచికల్‌పేట్: సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు కుకిడి రాజేశ్వర్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దరోగపల్లికి చెందిన కర్నె చంద్రకళకు రూ.14,500, బొంబాయి గూడకు చెందిన ఆలం చిన్నన్నకు రూ.20,500 చొప్పున మొత్తం రూ.35 వేల ఆర్థిక సహాయం అందజేశారు. దరోగపల్లిలో సర్పంచ్ బొట్టుపల్లి క్రిష్ణవేణి, బొంబాయి గూడలో ఉపసర్పంచ్ పాగిడి రఘునాథ్ లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా కార్యదర్శి బోయిరే నానయ్య, మండల ఉపాధ్యక్షుడు బొట్టుపల్లి హరీష్, ఉపసర్పంచ్ కర్నె శ్రీనివాస్, బూత్ అధ్యక్షుడు కర్నె వెంకన్న, నాయకులు బూర్గు శ్రీనివాస్, కర్నె తిరుపతి, ఎస్సీ మండల మోర్చా నాయకుడు పాగిడి కాంతారావు, యువ మోర్చా అధ్యక్షుడు మీసరి కమలాకర్, పోరిశెట్టి బుచ్చన్నతో పాటు గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.