నూతన రైతులకు సొసైటీ ద్వారా రుణాలు అందిస్తాం
సూర్య- బిక్కనూర్ : మండలంలోని పెద్ద మల్లారెడ్డి పిఎసిఎస్ సొసైటీ ద్వారా నూతన రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తామని, పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ సురేందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం స్థానిక సొసైటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు పలు తీర్మానాలను చేశారు. రైతులకు సంబంధించిన వరి ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. పెద్ద మల్ల రెడ్డి పిఎసిఎస్ ను ఆదర్శ సొసైటీగా చర్చిదిద్దేందుకు సొసైటీ డైరెక్టర్లు రైతులకు సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ సీఈవో మోహన్ గౌడ్, సిబ్బంది ఉన్నారు