పెద్దకొత్తిలి సర్పంచ్ గా యంకమ్మ ఏకగ్రీవం
*ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి*
గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత జరుగుతున్న నందవరం మండలం ఎన్నికల సరళిలో పెద్దకొత్తిలి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఈ ఏకగ్రీవమైనది. పంచాయతీకి పెద్దకొత్తిలి గ్రామం తో పాటు నాలుగు మజార గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 30 ఏళ్ల నుండి టిడిపి బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల రంగంలో గెలవలేదు. ఇటీవల జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో టిడిపి విజయం సాధించినప్పటికీ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి అయిన కోనప్ప సతీమణి శంకరమ్మకు సర్పంచ్ టికెట్ కూడా వైసిపి నాయకులు అందించారు. కోనప్ప చివరి క్షణంలో తన సతీమణి శంకరమ్మ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. టిడిపి మద్దతు గజేంద్ర రెడ్డి సతీమణి యంకమ్మ విజయం ఏకగ్రీవంగా వరించింది. అధికారులు డిక్లరేషన్ అందించారు. పంచాయితీ పరిధిలో 10 వార్డులు ఉండగా వాటిలో 9 మంది సభ్యులను ఇరు పార్టీలు ఒప్పందంతో ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఒకే ఒక్క వార్డు నెంబర్ కి పోటీ ఉంది. కాంగ్రెస్ వైసిపి కంచుకోటలుగా ఉన్న పెద్దకొత్తలి గ్రామపంచాయతీ సర్పంచ్ గా టిడిపి మద్దతుదారుడు గజేంద్ర రెడ్డి సతీమణి యంకమ్మ బోని కొట్టారు. దీంతో తుంగభద్రా నది తీరంలో ఉన్న ఐదు గ్రామాల్లో టిడిపి శ్రేణులు ఆనందోత్సవంలో ఉన్నారు.
*A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.*