గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి
నగరం, మేజర్‌న్యూస్ :
పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., పేర్కొన్నారు.
మంగళవారం నగరం మండలం అద్దంకి వారి పాలెం గ్రామంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 10 పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. పరిశీలించారు.
ఈ సందర్భంగా రెండవ సాధారణ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 02న జరగనున్న ఎన్నికల నిర్వహణకు సంబంధించి నగరం మండలం, అద్దంకి వారి పాలెం గ్రామం నందు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ఫర్నిచర్, ర్యాంపులు వంటి సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని, పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలుచోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నగరం మండల కేంద్రం ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల కు సంబంధించి మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఉన్న ఎన్నికల మెటీరియల్ ను కలెక్టర్ పరాశీలించారు.
జిల్లా కలెక్టర్ వెంట రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారిణి బి. శ్రీదేవి, తహశీల్దార్, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలు తదితరులు ఉన్నారు.