BREAKING
ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే లక్ష్యం. - చీఫ్ ఇంజినీర్ గాయత్రీ దేవి. నెల 26 న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు నూతన రైతులకు సొసైటీ ద్వారా రుణాలు అందిస్తాం మద్దికుంట నర్మదాకు మద్దతుగా టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం! లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు ఘన సన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి రామన్నపేటలో చేయూత పింఛన్ల పంపిణీ వైభవంగా తులసి మాత కళ్యాణ మహోత్సవాలు పెద్దకొత్తిలి సర్పంచ్ గా యంకమ్మ ఏకగ్రీవం ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి - మల్కాపూర్ లో సుడా మాజీ చైర్మన్ కేఎన్ఆర్ మార్నింగ్ వాక్ మంత్రి హామీతో మెడికోల నిరసన విరమణ ఫూలే దంపతుల పోరాట గాథ.. నవంబర్ 27న తెలుగులో రిలీజ్ కానున్న 'ఫూలే రిపబ్లిక్ డే క్యాంపునకు అల్ఫోర్స్ విద్యార్థిని లాస్య ఎంపిక వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై తెదేపాలో రచ్చ...!

అంతర్జాతీయ మేయర్ల సదస్సుకు కరీంనగర్ మేయర్‌కు ఆహ్వానం

Select Suryaa Now
అంతర్జాతీయ మేయర్ల సదస్సుకు కరీంనగర్ మేయర్‌కు ఆహ్వానం
సూర్య కరీంనగర్ : ముంబై వేదికగా నవంబర్ 25, 26 తేదీల్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక 3వ వరల్డ్ మేయర్స్ ఫోరం అంతర్జాతీయ సదస్సుకు కరీంనగర్ నగర మేయర్ కోలగాని శ్రీనివాస్‌కు ఆహ్వానం అందింది. ముంబైలోని ఫెయిర్‌మాంట్ హోటల్‌లో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల మేయర్లు, వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సదస్సులో ఏఐ ఆధారిత నగర నిర్వహణ, వ్యర్థాల సమస్య పరిష్కారం, పట్టణ రవాణా, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, సురక్షిత నగరాల నిర్మాణం, ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై కరీంనగర్ నగర అభివృద్ధి నమూనాను వివరించడంతో పాటు, ప్రపంచ నగరాల్లో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు మేయర్‌కు అవకాశం లభించనుంది.