BREAKING
ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే లక్ష్యం. - చీఫ్ ఇంజినీర్ గాయత్రీ దేవి. నెల 26 న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు నూతన రైతులకు సొసైటీ ద్వారా రుణాలు అందిస్తాం మద్దికుంట నర్మదాకు మద్దతుగా టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం! లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు ఘన సన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి రామన్నపేటలో చేయూత పింఛన్ల పంపిణీ వైభవంగా తులసి మాత కళ్యాణ మహోత్సవాలు పెద్దకొత్తిలి సర్పంచ్ గా యంకమ్మ ఏకగ్రీవం ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి - మల్కాపూర్ లో సుడా మాజీ చైర్మన్ కేఎన్ఆర్ మార్నింగ్ వాక్ మంత్రి హామీతో మెడికోల నిరసన విరమణ ఫూలే దంపతుల పోరాట గాథ.. నవంబర్ 27న తెలుగులో రిలీజ్ కానున్న 'ఫూలే రిపబ్లిక్ డే క్యాంపునకు అల్ఫోర్స్ విద్యార్థిని లాస్య ఎంపిక వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై తెదేపాలో రచ్చ...!

3వ వరల్డ్ మేయర్స్ ఫోరం 2026లో పాల్గొననున్న గుంటూరు మేయర్, కమిషనర్

Select Suryaa Now
3వ వరల్డ్ మేయర్స్ ఫోరం 2026లో పాల్గొననున్న గుంటూరు మేయర్, కమిషనర్

గుంటూరు : ముంబైలో జరిగే 3వ వరల్డ్ మేయర్స్ ఫోరం 2026 సమావేశంలో గుంటూరు నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, కమిషనర్ కె.మయూర్ అశోక్ పాల్గొననున్నారు. ఈనెల 25 నుండి 27, 2026 వరకు ముంబైలోని ఫెయిర్‌మాంట్ హోటల్‌లో ఈ ఫోరం జరగనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రధాన కార్యక్రమంగా ఈ ఫోరం జరుగుతోంది. 1926లో స్థాపించబడిన  ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంస్థ శిక్షణ, పరిశోధన, సంస్థాగత అభివృద్ధి, పట్టణ పాలన ద్వారా స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేస్తూ 100 ఏళ్ల సేవలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పట్టణాభివృద్ధిలో మహిళా నాయకత్వం, లింగ సమానత్వం, ఆర్థిక చేరిక అంశాలపై, వృత్తిపరమైన శిక్షణ, సామర్థ్య నిర్మాణం, పరిశోధన, సంస్థాగత అభివృద్ధి, సమర్థవంతమైన పట్టణ పాలనను ప్రోత్సహించడం ద్వారా స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరగనున్నా యి.ఈ సమావేశంలో భారతదేశం నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాలకు చెందిన మేయర్లు, నగర నాయకులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, పట్టణ నిపుణులు, అభివృద్ధి భాగస్వాములతో కలిపి 1,000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారని అంచనా. అలాగే నవంబర్ 27, 2026న పట్టణాభివృద్ధిలో మహిళా నాయకత్వం, లింగ సమానత్వం మరియు ఆర్థిక చేరిక అంశాలపై ప్రత్యేక మహిళా నాయకత్వ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 25 మంది ప్రతినిధులు ఈ ఫోరంలో పాల్గొనేందుకు పురపాలక పరిపాలన శాఖ నామినేట్ చేసింది.

 

సూర్య నాయక్