మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.. గ్రామాభివృద్ధికి కృషి చేస్తా!
మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.. గ్రామాభివృద్ధికి కృషి చేస్తా!
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
ఓర్వకల్లు మండల పరిధిలోని పూడిచెర్ల గ్రామంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి కడుమూరు వెంకటరమణమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గ్రామస్థులందరి సహకారంతో పూడిచెర్లను అభివృద్ధి పథంలో నడిపించుకుందామని పిలుపునిచ్చారు. తనను మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో సర్పంచ్‌గా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామంలోని పెద్దలు నాయకుల సహకారంతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు