telangana
కార్తీక పౌర్ణమి వేడుకల్లో సామూహిక వ్రతాలు
సూర్య నస్పూర్ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నస్పూర్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత ఆలయంలో మంగళవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ, పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ దంపతులతో పాటు 29 జంటలు పాల్గొన్నాయి. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా, అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.