BREAKING
శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో కార్తీక పౌర్ణమి యజ్ఞం అంతర్జాతీయ మేయర్ల సదస్సుకు కరీంనగర్ మేయర్‌కు ఆహ్వానం 3వ వరల్డ్ మేయర్స్ ఫోరం 2026లో పాల్గొననున్న గుంటూరు మేయర్, కమిషనర్ కార్తీక పౌర్ణమి వేడుకలతో గోదావరి తీరంలో ఆధ్యాత్మిక శోభ 'అలియాస్ రుక్మిణి' ట్రైలర్ అప్‌డేట్.. తనపై తానే సెటైర్ వేసుకున్న నాని కార్తీక పౌర్ణమి వేడుకల్లో సామూహిక వ్రతాలు సెమీస్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఎ! త్రివిక్రమ్ సినిమాలో ఇలాంటి పాట ఏంటి? యూట్యూబ్‌లో మళ్ళీ ట్రోల్ అవుతున్న వెంకటేష్ సాంగ్ పుల్లూరు బండపై భక్తుల కోలాహలం మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.. గ్రామాభివృద్ధికి కృషి చేస్తా! ఫహద్ ఫాజిల్ 'అసరీరి' రిలీజ్ డేట్ ఫిక్స్.. న్యూ ఇయర్ కానుకగా థియేటర్లలోకి గొల్లపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాం!! జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు పొదరాళ్లపల్లిలో విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి రైతు రెడ్డెప్పకు అండగా నిలిచిన MPTC హేమలత బాయి.. కలెక్టరేట్ గ్రంథాలయానికి 75 పుస్తకాల వితరణ

పొదరాళ్లపల్లిలో విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి రైతు రెడ్డెప్పకు అండగా నిలిచిన MPTC హేమలత బాయి..

Select Suryaa Now
పొదరాళ్లపల్లిలో విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి రైతు రెడ్డెప్పకు అండగా నిలిచిన MPTC హేమలత బాయి..

ముదిగుబ్బ: మండలంలోని పొదరాళ్లపల్లి గ్రామంలో విద్యుత్‌ షాక్‌కు గురై రైతు రెడ్డెప్పకు చెందిన ఆవు మృతి చెందింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో రైతు ఆవేదనకు గురయ్యాడు.

విషయం తెలుసుకున్న పొదరాళ్లపల్లి MPTC కె. హేమలత బాయి బుధవారం ఉదయం గ్రామానికి చేరుకుని, డాక్టర్ రామేశ్వరరావు, సంబంధిత అధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం పశువైద్యాధికారి డాక్టర్ రామేశ్వరరావు మృతి చెందిన ఆవుకు పోస్టుమార్టం నిర్వహించారు.ఈ ఘటనపై సత్యసాయి జిల్లా విద్యుత్ శాఖ SE రైతు రెడ్డెప్పతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. రైతుకు తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.రైతుకు అండగా నిలిచి, వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ SE, పశుసంవర్ధక శాఖ అధికారులు, డాక్టర్ రామేశ్వరరావుకు MPTC హేమలత బాయి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని ఆమె పేర్కొన్నారు

సూర్య న్యూస్ రిపోర్టర్ :- మల్లెల వన్నూరుస్వామి