BREAKING
ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి - మల్కాపూర్ లో సుడా మాజీ చైర్మన్ కేఎన్ఆర్ మార్నింగ్ వాక్ మంత్రి హామీతో మెడికోల నిరసన విరమణ ఫూలే దంపతుల పోరాట గాథ.. నవంబర్ 27న తెలుగులో రిలీజ్ కానున్న 'ఫూలే రిపబ్లిక్ డే క్యాంపునకు అల్ఫోర్స్ విద్యార్థిని లాస్య ఎంపిక వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై తెదేపాలో రచ్చ...! ఫూలే దంపతుల పోరాట గాథ.. నవంబర్ 27న తెలుగులో రిలీజ్ కానున్న 'ఫూలే నన్నూరులో 16 వార్డులు ఏకగ్రీవం.. సర్పంచ్ బరిలో ఇద్దరు అభ్యర్థులు!** కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్విత విద్యార్థుల పతకాల పంట శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో కార్తీక పౌర్ణమి యజ్ఞం అంతర్జాతీయ మేయర్ల సదస్సుకు కరీంనగర్ మేయర్‌కు ఆహ్వానం 3వ వరల్డ్ మేయర్స్ ఫోరం 2026లో పాల్గొననున్న గుంటూరు మేయర్, కమిషనర్ కార్తీక పౌర్ణమి వేడుకలతో గోదావరి తీరంలో ఆధ్యాత్మిక శోభ 'అలియాస్ రుక్మిణి' ట్రైలర్ అప్‌డేట్.. తనపై తానే సెటైర్ వేసుకున్న నాని కార్తీక పౌర్ణమి వేడుకల్లో సామూహిక వ్రతాలు సెమీస్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఎ!

పుల్లూరు బండపై భక్తుల కోలాహలం

Select Suryaa Now
పుల్లూరు బండపై భక్తుల కోలాహలం

పుల్లూరు బండపై భక్తుల కోలాహలం

-వైభవంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు.. 50కి పైగా జంటలతో ప్రత్యేక పూజలు

-కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా తులసి కల్యాణం

 

సిద్దిపేట రూరల్, మేజర్ న్యూస్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు బండపై వెలసిన స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.మంగళవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన అనంతరం 50కి పైగా జంటలు వ్రతాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తులసి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.ఈ సందర్భంగా ఆలయ వంశపారంపర్య అర్చకులు కలకుంట్ల వెంకటనరసింహాచార్యులు, కృష్ణమాచార్యులు,రంగాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి సన్నిధిలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా 50కి పైగా జంటలతో వ్రతాలను ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ క్షేత్రంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా సుదర్శన నరసింహ హోమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే వైకుంఠ ఏకాదశి, మాఘ అమావాస్య జాతర, నరసింహ జయంతి వేడుకలను కూడా ఏటా ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయగా వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శేషు కుమార్ వీణాచారి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, గ్రామ సర్పంచ్ కుంచం లత వెంకట్, మాజీ సర్పంచులు నరేష్, తిరుపతిరెడ్డి, గ్రామస్తులు రామారావు, దుర్గారెడ్డి, ఉడుత మల్లేశం, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

(సూర్య రూరల్, రమేష్)