వైకాపా సర్పంచి అభ్యర్థి నామినేషన్ ఆమోదం
ప్యాపిలి, మేజర్ న్యూస్: మండలంలోని మెట్టుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచి ఎన్నికకు సంబంధించి వైకాపా బలపరిచిన అభ్యర్థి చిన్నబోయిన చంద్రుడు నామినేషన్‌కు పరిశీలన (స్క్రూటినీ)లో ఆమోదం లభించింది. నామినేషన్ల దాఖలు సమయంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆయన అభ్యర్థిత్వంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే అధికారులు నిబంధనల ప్రకారం పత్రాలను పరిశీలించి నామినేషన్ సక్రమంగా ఉన్నట్లు ప్రకటించడంతో వైకాపా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తాజా పరిణామంతో మెట్టుపల్లి పంచాయతీ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.