BREAKING
పుల్లూరు బండపై భక్తుల కోలాహలం మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.. గ్రామాభివృద్ధికి కృషి చేస్తా! ఫహద్ ఫాజిల్ 'అసరీరి' రిలీజ్ డేట్ ఫిక్స్.. న్యూ ఇయర్ కానుకగా థియేటర్లలోకి గొల్లపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాం!! జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు పొదరాళ్లపల్లిలో విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి రైతు రెడ్డెప్పకు అండగా నిలిచిన MPTC హేమలత బాయి.. కలెక్టరేట్ గ్రంథాలయానికి 75 పుస్తకాల వితరణ భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం మహేశ్ బాబు లేటెస్ట్ లుక్‌పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ డైరెక్టర్ కోసమే ఇంతలా మారిపోయారా? ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి రెండో విడత రాండమైజేషన్ ను పూర్తి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. రైతులకు ఫెర్టిలైజర్ సేల్స్ యాప్‌పై అవగాహన!: వైకాపా సర్పంచి అభ్యర్థి నామినేషన్‌ ఆమోదం పోస్టల్ బ్యాలెట్ నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి కత్తెర గుర్తుపై ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా!

మహేశ్ బాబు లేటెస్ట్ లుక్‌పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ డైరెక్టర్ కోసమే ఇంతలా మారిపోయారా?

Select Suryaa Now
మహేశ్ బాబు లేటెస్ట్ లుక్‌పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ డైరెక్టర్ కోసమే ఇంతలా మారిపోయారా?

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా ఫోటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీసింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు, నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మహేశ్ బాబు షేర్ చేసిన ఆ ఫోటోలో ఆయన మునుపటి కంటే చాలా సన్నగా కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పుడూ ఎంతో ఫిట్‌గా, ఆరోగ్యకరమైన శరీరాకృతితో కనిపించే మహేశ్ బాబు చేతులు, కాళ్లు మరీ బక్కచిక్కినట్లుగా కనిపించడంతో ఫ్యాన్స్ ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం వారణాసి కోసం మహేశ్ బాబు ఇప్పటికే తీవ్రంగా శ్రమించారు. ఈ సినిమాలో రుద్ర, శ్రీరాముడి పాత్రల కోసం ఆయన శరీరాకృతిలో కీలక మార్పులు చేసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే వారణాసి షూటింగ్ దాదాపు పూర్తి కావస్తున్న తరుణంలో కూడా మహేశ్ బాబు ఇంతలా బరువు తగ్గడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.  

మరోవైపు, ఈ మేకోవర్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమా కోసమేనని టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో యానిమల్ వంటి చిత్రాలతో హీరోలను సరికొత్త కోణంలో ఆవిష్కరించిన సందీప్ రెడ్డి వంగా, తన తదుపరి ప్రాజెక్టులో మహేశ్ బాబును ఒక విభిన్నమైన, ఇంటెన్స్ లుక్‌లో చూపించడానికి సిద్ధమవుతున్నారని టాక్ నడుస్తోంది. ఆ పాత్రకు తగ్గట్లుగానే మహేశ్ బాబు ప్రత్యేక డైట్ ఫాలో అవుతూ ఇంత సన్నగా మారారని కొందరు అభిప్రాయపడుతున్నారు.  

ఏది ఏమైనా, 51 ఏళ్ల వయసులోనూ పాత్రల కోసం మహేశ్ బాబు పడుతున్న తపన, అంకితభావంపై ప్రశంసలు కురుస్తున్నప్పటికీ, డైట్ పేరుతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న వారణాసి చిత్రం ప్రస్తుతం వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.