పోస్టల్ బ్యాలెట్ నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి
బాపట్ల, మేజర్‌న్యూస్ :
2వ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలలో బాగంగా ఈ నెల 26 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల లలో విధులు నిర్వహించే పి ఓ లు,ఏ పి ఓ లు ఓ పిఓ లకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ నిర్వహణను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి., పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుని సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా శరీరం చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. అనంతరం ఈనెల 26న జరగనున్న మున్సిపల్ మున్నాం వారి పాలెం పురపాలక ప్రాథమిక స్కూల్ నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల కు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ.ఏ.హరి కుమార్, మున్సిపల్ కమిషనర్ యం.హాసిని, డిఆర్డిఏ పిడి బి. సింగయ్య, మున్సిపల్ శాఖ డీ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.