telangana
కన్నుల పండుగ గా కార్తీక పౌర్ణమి జాతర - వేలాదిగా తరలి వచ్చిన భక్తులు
సూర్య దండేపల్లి : తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దండేపల్లి మండలంలోని గూడెం రమాసహిత సత్యనారాయణ స్వామి దర్శనానికి, కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామిని దర్శించుకొన్నారు , స్వామి వారి వ్రతాలు. నోముకొన్నారు, భక్తులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు అన్ని ప్రాంతాాలలో పోలీసులు తగు జాగ్రత్తలు ఏర్పాట్లు చేశారు , గుట్టపైకి క్యూ లైన్ లో భక్తులు వెళ్లి స్వామి దర్శనం చేసుకొని తన్మయత్వం పొందారు, ప్రసాద్ గోదావరి నదివద్ద భక్తులకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు ఏర్పాటు చేసి,నదిలోపలికి వెళ్లకుండా సూచనలు చేశారు, ఆలయ కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ భక్తుల కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూశారు, దండేపల్లి , జన్నారం ,లక్షెట్టిపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బారి బందా వొస్తు నిర్వహించారు, కాగా రామగుండం సీపీ అంబర్ కిషోర్ సైతం గూడెం లో ప్రత్యేక శ్రద్ధ తో పరిస్థితులను పర్యవేక్షించారు.