telangana
మండలంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
సూర్య రెంజల్ : మహా పుణ్యక్షేత్రం అయినటువంటి కందకుర్తి త్రివేణి సంగమ గోదావరి నదికి భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు. మంగళవారం కార్తీకమాసంలో కావడంతో నదికి భక్తులు భారీగా తరలివచ్చి నదిలో స్నానాలను ఆచరించి, శివలింగాలను ఏర్పాటు చేసి, కార్తీకం మాసంలో మహా శివునికి ఇష్టమైనటువంటి ఉసిరి దీపాలతో జ్యోతులను వెలిగించి, మట్టి, పిండి ప్రమిదలలో కూడా దీపాలను వెలిగించి, మహా శివునికి నైవేద్యాలను సమర్పించి, గోదావరి నదిలో దీపాలను వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. దీపావళి తర్వాత 15 రోజులపాటు కార్తీక మాసం ప్రారంభం కావడంతో మహిళలు భక్తులు ఉదయం- సాయంత్రం వేళలో తులసి కోటల వద్ద జ్యోతులను వెలిగించి పూజ కార్యక్రమాలను నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకున తులసి కోటల వద్ద శ్రీకృష్ణుని ప్రతిమలను ఏర్పాటు చేసి ఉసిరి చెట్టుకు- తులసికి కళ్యాణం జరిపించి ఉసిరి దీపాలను వెలిగించి మొక్కులను చెల్లించుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున కొందరు 365 రోజుల సంబంధించిన ఒత్తులు కూడా గోదావరి నది ఒడ్డున మరియు తులసి కోటల ముందు దీపాలను వెలిగించి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళ భక్తులు, యువతులు, చిన్నారులు పాల్గొన్నారు.