BREAKING
గొల్లపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాం!! జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు పొదరాళ్లపల్లిలో విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి రైతు రెడ్డెప్పకు అండగా నిలిచిన MPTC హేమలత బాయి.. కలెక్టరేట్ గ్రంథాలయానికి 75 పుస్తకాల వితరణ భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం మహేశ్ బాబు లేటెస్ట్ లుక్‌పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ డైరెక్టర్ కోసమే ఇంతలా మారిపోయారా? ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి రెండో విడత రాండమైజేషన్ ను పూర్తి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. రైతులకు ఫెర్టిలైజర్ సేల్స్ యాప్‌పై అవగాహన!: వైకాపా సర్పంచి అభ్యర్థి నామినేషన్‌ ఆమోదం పోస్టల్ బ్యాలెట్ నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి కత్తెర గుర్తుపై ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! హైదరాబాద్‌లోని రూ.12 కోట్ల ఇంటిని అమ్మేసిన అనుష్క శెట్టి.. టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పినట్లేనా? ఈ నెల 29న కాగజ్ నగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం మండలంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

అనుమతి లేని "కోకా"ను తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం

Select Suryaa Now
అనుమతి లేని "కోకా"ను తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం
సూర్య, అర్మూర్ ప్రతినిధి: అధికారుల మధ్య ఏర్పడిన సమన్వయ లోపం బాధితునికి శాపంగా మారింది. సుమారు 10 నెలలపాటు అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నప్పటికీ న్యాయం పొందలేకపోతున్నాడు. అనుమతి లేని కోకాను తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం నిదర్శనంగా మారింది. ఆర్మూర్ పట్టణంలోని మగ్గం నగర్ కాలనీకి చెందిన  బాధితుడు షేక్ షబ్బీర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు  ఐదుసార్లు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కు మూడుసార్లు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ కు  మూడుసార్లు, ఆర్మూర్ ఎసిపి కు మూడుసార్లు, మున్సిపల్ కమిషనర్ కు ఐదుసార్లు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ బాధితుడు  ఎదుర్కొంటున్న సమస్య పరిష్కరించలేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వ్యాపార నిమిత్తం సొంతంగా పంత్ రోడ్డు లో షట్టర్ కొనుగోలు చేసుకున్నాడు. అయితే షట్టర్ ఎదురుగా తోఫిక్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతి లేకుండా డ్రైనేజ్ పై  కోకాను పెట్టుకున్నాడు. ఈ విషయమై బాధితుడు షేక్ షబ్బీర్ అనేకసార్లు కోకాను తొలగించాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో రెండుసార్లు గొడవలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. నానా రీతులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని బాధితుడు "సూర్య" ప్రతినిధితో మొరపెట్టుకున్నాడు.జిల్లా ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తే కిందిస్థాయి అధికారులకు సమాచారం చేరవేసిన స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ను కలిసి వివరించగా పోలీసుల అనుమతి తీసుకోమని సలహా ఇచ్చాడు, మరి పోలీసుల వద్దకు వెళితే మునిసిపల్ అధికారుల నుండి లిఖితపూర్వకంగా లెటర్ కావాలని కోరుతున్నాడని వాపోయాడు. లక్షల రూపాయలు వెచ్చించి వ్యాపారం చేసుకుంటుండగా అడ్డుగా ఉన్న కోక వల్ల నష్టాల పాలవుతున్నానని పేర్కొంటున్నాడు. మున్సిపల్ కమిషనర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ల మధ్య సమన్వయ లోపం కారణంగా చిన్న సమస్యను సైతం వారు పరిష్కరించలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వేసుకున్న కోకాను తొలగించలేకపోవడమే  కాకుండా వారంటే వీరు వీరంటే వారు అంటూ కాలయాపన చేయడం గమనార్హం. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాలను సైతం బే ఖాతరు చేయడం గమనించదగ్గ విషయం.ఏదేమైనప్పటికీ సంబంధిత అధికారులు బాధితుని పక్షాన నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.