BREAKING
ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి రెండో విడత రాండమైజేషన్ ను పూర్తి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. రైతులకు ఫెర్టిలైజర్ సేల్స్ యాప్‌పై అవగాహన!: వైకాపా సర్పంచి అభ్యర్థి నామినేషన్‌ ఆమోదం పోస్టల్ బ్యాలెట్ నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి కత్తెర గుర్తుపై ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! హైదరాబాద్‌లోని రూ.12 కోట్ల ఇంటిని అమ్మేసిన అనుష్క శెట్టి.. టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పినట్లేనా? ఈ నెల 29న కాగజ్ నగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం మండలంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు అనుమతి లేని "కోకా"ను తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం బడి మెట్టు ఎక్కిన మెగా ప్రిన్సెస్.. క్లీంకార క్యూట్ వీడియో వైరల్ కన్నుల పండుగ గా కార్తీక  పౌర్ణమి జాతర - వేలాదిగా తరలి వచ్చిన భక్తులు జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీక్షణ సమావేశం వైభవ్‌ ఊచకోత.. 52 బంతుల్లో డబుల్‌ సెంచరీ! లిస్ట్‌-ఎ క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు భక్తుల సౌకర్యార్థం పూర్తిస్థాయి ఏర్పాట్లు - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

భక్తుల సౌకర్యార్థం పూర్తిస్థాయి ఏర్పాట్లు - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Select Suryaa Now
భక్తుల సౌకర్యార్థం పూర్తిస్థాయి ఏర్పాట్లు - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
సూర్య దండేపల్లి : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం  దండేపల్లి మండలం గూడెంగుట్టలోని శ్రీ సత్యనారాయణ స్వామిని సతీ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలంకరణతో పాటు ఇతర అవసరమైన ఏర్పాట్లు చేయగా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్యూలైన్ల నిర్వహణ, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు లక్ష మందికి పైగా భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆశీస్సులతో జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శాంతి, సామరస్యం, సుఖసంతోషాలు, సర్వతోముఖాభివృద్ధి కలగాలని  ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు,