BREAKING
గొల్లపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాం!! జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు పొదరాళ్లపల్లిలో విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి రైతు రెడ్డెప్పకు అండగా నిలిచిన MPTC హేమలత బాయి.. కలెక్టరేట్ గ్రంథాలయానికి 75 పుస్తకాల వితరణ భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం మహేశ్ బాబు లేటెస్ట్ లుక్‌పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ డైరెక్టర్ కోసమే ఇంతలా మారిపోయారా? ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి రెండో విడత రాండమైజేషన్ ను పూర్తి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. రైతులకు ఫెర్టిలైజర్ సేల్స్ యాప్‌పై అవగాహన!: వైకాపా సర్పంచి అభ్యర్థి నామినేషన్‌ ఆమోదం పోస్టల్ బ్యాలెట్ నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి కత్తెర గుర్తుపై ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! హైదరాబాద్‌లోని రూ.12 కోట్ల ఇంటిని అమ్మేసిన అనుష్క శెట్టి.. టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పినట్లేనా? ఈ నెల 29న కాగజ్ నగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం మండలంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీక్షణ సమావేశం

Select Suryaa Now
జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్  వీక్షణ సమావేశం

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

  బాపట్ల జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని, బాగా పని చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీఠా ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు.
   
       ఇప్పటివరకు నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో ఎలాంటి సంఘటనలు బాపట్ల జిల్లాలో చోటు చేసుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఎన్నికలు జయప్రదంగా నిర్వహించడం సంతోషదాయకం అన్నారు. ఇదే తరహాలో ఈనెల 26వ తేదీన మునిసిపల్ ఎన్నికలు, గ్రామపంచాయతీ మొదటి దశ ఎన్నికలు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, బందోబస్తు, భద్రత చర్యలు ముందస్తు ప్రణాళికతో ఉండాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలలో సమస్యాత్మక, తీవ్రసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు ఉంచాలన్నారు. ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. 
     
     జిల్లాస్థాయి అధికారులకు కేటాయించిన సీయూజీ ఫోన్ నెంబర్లు పని చేయడంలేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికల సమయంలో సదరు ఫోన్ నెంబర్లు అందుబాటులో లేకపోతే కమ్యూనికేషన్ దెబ్బతినే అవకాశం ఉందన్నారు. డబ్బులు చెల్లించినప్పటికీ సేవలు అందడం లేదని, నెట్వర్క్ సమస్యగా సదరు కంపెనీ చెబుతోందన్నారు. తక్షణమే ఆ ఫోన్ నెంబర్లు పని చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. 
          
         ఈ సమావేశంలో జిల్లా నుంచి వ్యయ పరిశీలకులు జి. కృష్ణప్రియ, డిఆర్ఓ లవన్న, డిపిఓ నగేష్ కుమారి, బాపట్ల మున్సిపల్ కమిషనర్ ఏం.హాసిని, తదితరులు పాల్గొన్నారు.