పుట్టపర్తి మున్సిపల్ గా మేకల ఈశ్వర్ ప్రమాణ స్వీకారం
పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ గా మేకల ఈశ్వర్ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయంలో పుట్టపర్తి ఆర్డిఓ సువర్ణ మేకల ఈశ్వర్ తో మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.