telangana
గాజులరామారం డివిజన్ లో వివిధ పార్టీల మహిళలు, నాయకులు బిజెపి లో చేరిక. బిజిపి పాలనలోనే దేశం సుభిక్షం --గిరివర్ధన్ రెడ్డి.
హైదరాబాద్, ఆల్వాల్, మేజర్ న్యూస్ :మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా కార్యాలయంలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలోని గాజులరామారం డివిజన్‌కు చెందిన వివిధ పార్టీల మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. జిల్లా అధ్యక్షులు గిరి వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలోచేరిన,వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు..ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మున్సిపల్ కో-కన్వీనర్ రావుల శేషగిరి రావు గారు, జిల్లా నాయకులు శేఖర్ ముదిరాజ్ , డివిజన్ అధ్యక్షులు సాయి ప్రతాప్ , ముఖ్య నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.