BREAKING
దక్షిణ కొరియా విద్యాశాఖ మంత్రి చోయ్ క్యో-జిన్ రాజీనామా! గాజులరామారం డివిజన్ లో  వివిధ పార్టీల మహిళలు, నాయకులు బిజెపి లో చేరిక. బిజిపి పాలనలోనే  దేశం సుభిక్షం --గిరివర్ధన్ రెడ్డి. మూసలే ఈశ్వర్ రావు కు సామాజిక రంగంలో పీ హెచ్ డి హెచ్ స్ సి ఎస్  గౌరవ డాక్టరేట్ కృత్రిమ మేధ (AI) పెట్టుబడులపై ఆందోళనలు: ఆసియా మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి.. అమెరికా సూచీల ఫ్యూచర్స్‌కు స్వల్ప ఊరట! కృష్ణకాంత్ పార్కులో.. మార్నింగ్.. వాకింగ్.. టాకింగ్..! వాకర్స్ తో హైడ్రా కమిషనర్ మాటామంతీ అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు చారిత్రక ఆధిక్యం: కనీసం 258 స్థానాలతో మూడు దశాబ్దాల్లోనే అత్యధిక మెజారిటీ! సైబరాబాద్ డ్రంక్ & డ్రైవ్ లో 288 మందిపై కేసులు - ట్రాఫిక్ ఏడీసీపీ అడ్మిన్, జి నరేెందర్ హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలలో బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని బెదిరింపు ఈమెయిల్, వదంతులను నమ్మవద్దు సీపీ మహెష్ మురళిదర్ భగవత్ చీరాల మున్సిపల్ వైస్ చైర్మన్ గా తేలప్రోలు రమేష్ కుమార్ ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా కుతుబ్ షాహీ సమాధుల వద్ద ‘ప్రకృతి – వారసత్వం సమ్మేళనం’ ప్రత్యేక వాక్ నిర్వహించిన తెలంగాణ పర్యాటక శాఖ కాంగ్రెస్ లో పలువురు యువకుల చేరిక కంభంలో తోట మహాలక్ష్మి ప్రచార జోరు జనవరి 3న టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర తృతీయ మహాసభలు డి.వి. రాజు ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రధానం పుట్టపర్తి మున్సిపల్ గా మేకల ఈశ్వర్ ప్రమాణ స్వీకారం

డి.వి. రాజు ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రధానం

Select Suryaa Now
డి.వి. రాజు ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రధానం
రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ 22 : కాకినాడ మ్యూజికల్ గ్రూప్ ఆధ్వర్యంలో డి.వి. రాజు ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026 పురస్కార ప్రదానోత్సవ వేడుకలు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం పాల్గొని ప్రముఖ రచయిత్రి కమరాజుగడ్డ వాసవదత్త రమణ జ్యోతి, వంశీ సంస్థల అధినేత డాక్టర్ వంశీ రామరాజు తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సినీ సంగీత స్వర్ణయుగాన్ని భావితరాలకు అందించడం సంతోషదాయకమన్నారు. కాకినాడ మ్యూజికల్ గ్రూప్ విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. గాయని గాయకులు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సినీ సంగీత రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులను ఘనంగా సత్కరించనున్నారు. కార్యక్రమంలో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్కొమ్మందూరి రామాచారి , వి. శశికళ స్వామి, సింగింగ్ స్టార్ చింతలపాటి సురేష్, మెలోడీ క్వీన్ బి. విజయలక్ష్మి, దివాకర్ల సురేఖ మూర్తిలకు పురస్కారాలు అందజేశారు. సభకు కాకినాడ మ్యూజికల్ గ్రూప్ వ్యవస్థాపకులు జి.ఎస్.జె. కుమార్ ఆధ్వర్యంలో గాయని, గాయకులు టాలీవుడ్, బాలీవుడ్ స్వర్ణయుగ సినీ గీతాలు అలరించాయి