telangana
చిన్నారుల ఆరోగ్యం, వారి బంగారు భవిష్యత్తు కు రెండే రెండు పోలియో చుక్కలు
హైదరాబాద్, ఆల్వాల్, మేజర్ న్యూస్ : చిన్నారుల ఆరోగ్యం, వారి బంగారు భవిష్యత్తు కు రెండే రెండు పోలియో చుక్కలు ఏంటో కీలకమని ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆదివారం ఆల్వాల్ పి హేచ్ సి లో పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఇదేళ్లలోపు పిల్లందరికి టీకాలు అందించడం ద్వారా పోలియో మహమ్మారీ ని నివారించవచ్చని తల్లి తండ్రులు ఈ కార్యక్రమాన్ని తమ భాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
*పోలియో పై నిర్లక్ష్యం వద్దు.*
పోలియో వైరస్ చిన్నారుల నాది వ్యవస్థ పై ప్రభావం చూపించు శాశ్వత అనగా వ్యకల్యానికి దారి తీస్తుందని, దీనికి నిర్డీష్ట చికిత్స లేనందున టీకా మాత్రమే నివారణ అత్యంత ముఖ్యమని వివరించారు.చిన్నారులను పోలియో చుక్కలు వేయించుకొని పిల్లల కోసం వైద్య సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి టీకా వేస్తారని శ్రీ కాంత్ తెలిపారు. ఈ నెల 23,24 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారన్నారు. ముఖ్యంగా వలస కుటుంబాలవారి పిల్లలకు, పని నిమిత్తం బయటికి బయటికి వెళ్లే చిన్నారులను గుర్తించి టీకా అందేలా కార్యాచరణ చేపట్టారు.