BREAKING
ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా కుతుబ్ షాహీ సమాధుల వద్ద ‘ప్రకృతి – వారసత్వం సమ్మేళనం’ ప్రత్యేక వాక్ నిర్వహించిన తెలంగాణ పర్యాటక శాఖ కాంగ్రెస్ లో పలువురు యువకుల చేరిక కంభంలో తోట మహాలక్ష్మి ప్రచార జోరు జనవరి 3న టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర తృతీయ మహాసభలు డి.వి. రాజు ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రధానం పుట్టపర్తి మున్సిపల్ గా మేకల ఈశ్వర్ ప్రమాణ స్వీకారం ఏపీకి మూడు కొత్త రైల్వే లైన్లు.. 560 కి.మీ. మేర కొత్త ట్రాక్ ప్రతిపాదన! చిన్నారుల ఆరోగ్యం, వారి బంగారు భవిష్యత్తు కు  రెండే రెండు పోలియో చుక్కలు మార్కండేయ స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు మంత్రి శ్రీధర్ బాబు మొండి వైఖరి వీడాలి – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పై కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి! సురభి వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ పేద విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ సామాజిక పరివర్తన విద్యార్థులతోనే సాధ్యం ఎమ్మార్పీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ బీసీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాగిలి సత్యం స్ప్రింగ్ ఆనకట్ట మరమ్మతులు చేపట్టాలి... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.

మంత్రి శ్రీధర్ బాబు మొండి వైఖరి వీడాలి – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పై కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి!

Select Suryaa Now
మంత్రి శ్రీధర్ బాబు మొండి వైఖరి వీడాలి     – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పై కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి!
ఎంపీ గడ్డం వంశీకృష్ణపై కార్యకర్తలతో మంత్రి శ్రీధర్ బాబు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం మానుకోవాలని, తన వైఖరిని మార్చుకోవాలని ST/SC తెలంగాణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్. రమేష్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. సుధాకర్ డిమాండ్ చేశారు.ప్రజాప్రతినిధుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వారు పేర్కొన్నారు.ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రజా సమస్యలపై పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటం మంత్రి శ్రీధర్ బాబుకు నచ్చడం లేదా అనే ప్రశ్నను వారు లేవ నెత్తారు.దళితుల ఓట్లు ప్రభుత్వానికి అవసరం లేదా? దళితులంటే ఎందుకింత చిన్నచూపు? దళిత నాయకులు రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందడం నచ్చడం లేదా? అని వారు ప్రశ్నించారు.దళిత నాయకుల ఎదుగుదలను అడ్డుకునే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే ST/SC తెలంగాణ సమితి చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మంత్రి శ్రీధర్ బాబు తన వైఖరిని మార్చుకోకపోతే ST/SC తెలంగాణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే మంత్రి నివాసం ఎదుట శాంతియుత ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.దళితుల ఆత్మగౌరవం, హక్కులు, దళిత నాయకుల అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో sc st తెలంగాణ సమితి రాష్ట్ర అధ్యక్షులు r రమేష్ నాయక్ రాష్ట్ర జెనరల్ సెక్రెటరీ v సుధాకర్ treser అర్జున్ నాయక్ మదన్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.