BREAKING
జనవరి 3న టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర తృతీయ మహాసభలు డి.వి. రాజు ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రధానం పుట్టపర్తి మున్సిపల్ గా మేకల ఈశ్వర్ ప్రమాణ స్వీకారం ఏపీకి మూడు కొత్త రైల్వే లైన్లు.. 560 కి.మీ. మేర కొత్త ట్రాక్ ప్రతిపాదన! చిన్నారుల ఆరోగ్యం, వారి బంగారు భవిష్యత్తు కు  రెండే రెండు పోలియో చుక్కలు మార్కండేయ స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు మంత్రి శ్రీధర్ బాబు మొండి వైఖరి వీడాలి – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పై కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి! సురభి వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ పేద విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ సామాజిక పరివర్తన విద్యార్థులతోనే సాధ్యం ఎమ్మార్పీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ బీసీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాగిలి సత్యం స్ప్రింగ్ ఆనకట్ట మరమ్మతులు చేపట్టాలి... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ 20 26 కు ఎంపిక. లబ్ధిదారురాలికి ఇందిరమ్మ బీమా అందజేత మురహరి ప్రేమలత నరసయ్యని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన హనుమంతునిపాడు మండల తెలుగుదేశంపార్టీ నాయకులు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.

Select Suryaa Now
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.

సూర్య సారంగాపూర్: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించకపోవడం, ప్రారంభించిన చోట్ల ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సారంగాపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు.
కోతలు పూర్తయి ధాన్యం రాశులు కల్లాల్లో సిద్ధంగా ఉన్నా కొనుగోళ్లు జరగకపోవడంతో అకాల వర్షాల భయంతో పాటు, రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి, ఎలాంటి జాప్యం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు కోండ్ర రాంచంద్రారెడ్డి, ప్రేమానందం, బైరి మల్లేష్, ఎదులాపురం యశ్వంత్, కాలగిరి మధుసూదన్ రెడ్డి, పెద్దిరెడ్డి స్వామిరెడ్డి, కాలగిరి రఘుపతిరెడ్డి, కొక్కు గంగారాం, బియ్యాల రాంచందర్ రావు, మానుక రాజన్న, రాకేష్, బత్తుల సుధాకర్, ఆదర్శ్ తదితరులతో పాటు సారంగాపూర్ మండల రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.