స్ప్రింగ్ ఆనకట్ట మరమ్మతులు చేపట్టాలి...
సూర్య బెజ్జుర్ :కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జుర్ మండల పరిధిలోని 5 స్ప్రింగ్ ఆనకట్ట మరమ్మతులు చేపట్టాలని కోరుతూ సంబంధిత నోడల్ అధికారికి వినతి సమర్పించారు. ఆనకట్ట మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగించాలని కోరారు.
ఆనకట్ట పరిస్థితిని పరిశీలించి, అవసరమైన మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలని వినతిలో పేర్కొన్నారు. అధికారులు స్పందించి రైతుల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.