హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ :సీనియర్ ప్రొఫెసర్, న్యాయ శాస్త్ర నిపుణుడు, న్యాయ శాస్త్ర మేధావి, జనరల్ ఎడిటర్ తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణ రెడ్డికి ఈ నెల 26 న జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2026 కు ఎంపిక చేసినట్టు తెలంగాణ మేధావుల పురం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ , కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ అక్బర్ అలీ నేడు ఒక ప్రతిక ప్రకటనలో తెలిపారు. ప్రొఫెసర్ వి . బాల కిష్ట రెడ్డి గత 38 సంవత్సరాలుగా న్యాయ శాస్త్రంలో న్యాయ విద్యార్థులకు, సమాజానికి నిర్విరామంగా న్యాయశాస్త్రంలో పరిశోధకుడిగా, నిపుణుడిగా, రచయితగా, ఇండియన్ జనరల్ ఆఫ్ హెయిర్ అండ్ స్పేస్ ల, ఇండియన్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అండ్ మ్యారీటైజ్ లా చీఫ్ ఎడిటర్గా ఉండి న్యాయ శాస్త్రం పై ప్రజలను విద్యార్థులను తన ప్రసంగాల ద్వారా న్యాయ శాస్త్రం పై జాగృతి పరిచారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇంటర్నేషనల్ లాలో ఎల్ఎల్ఎం పూర్తి చేసి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ నుండి పీహెచ్డీ పట్టా పొందారు. ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ లలో 12 సంవత్సరాలుగా బోధన పరిశోధన అనుభవం కలిగిన వ్యక్తి. షామీర్పేట్ లోని నల్సార్ లా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం పట్టా పూర్తి చేశారు, అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరి రిజిస్టార్గా సెంటర్ ఫర్ ఏ రోజు పేస్ డిఫెన్స్ అధిపతిగా సేవలందించారు. అంతరిక్ష చట్టంపై భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నియమించిన ముసాయిదా కమిటీలో క్రియాశీలక సభ్యులుగా సేవలందించారు. తెలంగాణ మార్కెట్ చట్టం 2006, ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ డెవలప్మెంట్ బిల్లు 2016, భూ సేకరణ బిల్లు 2017, తెలంగాణ పురపాలక సంస్థ బిల్లు 2019 చట్టాలు వివిధ విధానాలు లపై అనేక పుస్తకాలు రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం 2017 లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అవార్డుతో సత్కరించింది. 2021 వ సంవత్సరంలో నల్సార్ నల్సార్ ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్ అవార్డు అందుకున్నారు.