BREAKING
ఎన్విడియాకు మరో భారీ షాక్: జెన్సెన్ హువాంగ్ నిష్క్రమణ తర్వాత అకౌంటింగ్ అవకతవకలపై యూఎస్ ఎస్‌ఈసీ దర్యాప్తు! రాచులూర్ లో పల్స్ పోలియో కార్యక్రమం డీసీసీ అధ్యక్షుడిగా ధారాసింగ్ నాయక్‌కు ఏడాది పూర్తి.. పెద్దేముల్ మండల కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి ఎన్.నగరం సర్పంచ్ బరిలో లక్ష్మీదేవమ్మ, గాయత్రి ఎంపీడీవో కార్యాలయంలో వేర్వేరుగా నామినేషన్ల దాఖలు తరలివచ్చిన గ్రామస్థులు, మద్దతుదారులు.. సందడిగా మారిన పరిసరాలు రావల్ కోల్‌లో ఓవర్‌లోడ్ వాహనాల బీభత్సం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం పుట్టపర్తికి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ చైనా ఏఐ స్టాక్స్‌లో 1.7 ట్రిలియన్ డాలర్ల భారీ పతనం: ఒకప్పటి హాట్ ట్రేడ్ కాస్తా మదుపర్లకు నష్టాల ఊబిగా మారిన వైనం! ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో ఉత్కంఠ ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు గుడ్ న్యూస్*నవంబర్ 25 నుంచి కొత్తగూడెంలో ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ, నమోదు ప్రక్రియ ప్రారంభం* భారత ఐటీ కంపెనీలు ఏఐ వల్ల అంతరించిపోతాయన్న ప్రచారాన్ని తోసిపుచ్చిన రాజీవ్ ఠక్కర్ క్యూ3 ఫలితాలు క్యూ2 స్థాయిలో ఉండకపోవచ్చు: మార్కెట్ నిపుణుడు రాఘవేంద్ర నాథ్ హీరో ఫిన్‌కార్ప్ భారీ విస్తరణ ప్రణాళిక… గేదె పాలపై రూ.6, ఆవు పాలపై రూ.4 పెంచిన 'గోకుల్' డెయిరీ: సేకరణ ధరల పెంపు నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం,,,

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి

Select Suryaa Now
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి

కొందుర్గు (రంగారెడ్డి): ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కొందుర్గ్ సర్పంచ్ చౌడపురం ప్రభాకర్ కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో,  అంగన్వాడి కేంద్రాలలో, పాఠశాల ఆవరణలో చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమాలను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని కోరారు. అలాగే మండల పరిధిలోని ముట్పూర్ లో సర్పంచ్ కనకమామిడి అంజయ్య పోలియో చుక్కల కార్యక్రమాలను ప్రారంభించారు. మండల పరిధిలోని చిన్న ఎల్కిచర్లలో సర్పంచ్ రాజ్ కుమార్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల పరిధిలోని గంగన్నగూడెంలో సర్పంచ్ విక్రం రెడ్డి పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఆగిర్యాలలో సర్పంచ్ శేఖర్ రెడ్డి పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల పరిధిలోని చెరుకుపల్లి లో సర్పంచ్ నల్లని యాదయ్య పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల పరిధిలోని పులుసుమామిడిలో సర్పంచ్ అమర్నాథ్ రెడ్డి పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు.


అలాగే మండల పరిధిలోని లాలాపేటలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని సర్పంచ్ శారదా నర్సింలు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మండల వైద్యాధికారి డాక్టర్ తబుసం, ఉప సర్పంచులు  సి చంద్రశేఖర్, మహేష్ యాదవ్, వైద్య సిబ్బంది రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

ఈరమొల్ల సత్యనారాయణ మేజర్ న్యూస్.