పుట్టపర్తికి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరిగే శ్రీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోస్తవంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పుట్టపర్తికి చేరుకున్నారు. శ్రీ సత్య సాయి విమానాశ్రయంలో గవర్నర్ కు కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూర, ఆర్డీవో సువర్ణ, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.