రాచులూర్ లో పల్స్ పోలియో కార్యక్రమం
కందుకూరు, మేజర్ న్యూస్: కందుకూరు మండలంలోని రాచులూరు గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని సర్పంచ్ తిరుగమల్ల సుమలత కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొత్త శేఖర్, తాళ్ల వెంకటేష్, పోతగాని రాఘవేందర్, మరాఠీ అందాలు, వైద్యులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సర్పంచ్ కోరారు.
టి శ్రీనివాస్, మేజర్ న్యూస్ కందుకూర్, రంగారెడ్డి జిల్లా.