పల్స్ పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ బొక్క సువర్ణ అంజిరెడ్డి
కందుకూరు, మేజర్ న్యూస్ : చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సర్పంచ్ బొక్క సువర్ణ అంజిరెడ్డి సూచించారు. ఆదివారం కందుకూరు మండలం కొత్తగూడ లో సర్పంచ్ ఆధ్వర్యంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పిల్లల ఆరోగ్యం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందని, చుక్కలు వేయించి వారి భవిష్యత్తును కాపాడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవీందర్, వార్డు సభ్యులు తాళ్ల బాలేష్, తల్లోజు వెంకటాచారి, బొక్క దీక్షిత్ రెడ్డి, నాయకులు బొక్క సురేందర్ రెడ్డి, కిరణ్ ముదిరాజ్, జగదీశ్వర్ గౌడ్, కుమ్మరి కృష్ణయ్య, ఆశా వర్కర్ చీమల అనిత, అంగన్‌వాడీ టీచర్ తల్లోజు సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూరు, రంగారెడ్డి జిల్లా.