BREAKING
ఏపీకి మూడు కొత్త రైల్వే లైన్లు.. 560 కి.మీ. మేర కొత్త ట్రాక్ ప్రతిపాదన! చిన్నారుల ఆరోగ్యం, వారి బంగారు భవిష్యత్తు కు  రెండే రెండు పోలియో చుక్కలు మార్కండేయ స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు మంత్రి శ్రీధర్ బాబు మొండి వైఖరి వీడాలి – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పై కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి! సురభి వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ పేద విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ సామాజిక పరివర్తన విద్యార్థులతోనే సాధ్యం ఎమ్మార్పీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ బీసీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాగిలి సత్యం స్ప్రింగ్ ఆనకట్ట మరమ్మతులు చేపట్టాలి... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ 20 26 కు ఎంపిక. లబ్ధిదారురాలికి ఇందిరమ్మ బీమా అందజేత మురహరి ప్రేమలత నరసయ్యని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన హనుమంతునిపాడు మండల తెలుగుదేశంపార్టీ నాయకులు మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యం మార్కాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎంపిక పై ఉత్కంఠ శ్రీ సత్యసాయి బాబా వారి 101వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి

నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యం లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Select Suryaa Now
నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యం లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యం
లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నేరేడుచర్ల మేజర్ న్యూస్
నేరేడుచర్ల: లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు లయన్ షేక్ యూసుఫ్ అధ్యక్షతన జరిగిన ఈ శిబిరాన్ని డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్ చల్లా ప్రభాకర్ రెడ్డి, డయాబెటిస్ నిపుణుడు డాక్టర్ షేక్ సమీవుద్దీన్, పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ ప్రవీణ్ నాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కంటి, గుండె, క్యాన్సర్, మధుమేహం తదితర వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ నిరుపేదలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించడంలో లయన్స్ క్లబ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి సరికొప్పుల నాగేశ్వరరావు, కోశాధికారి సైదులు నాయక్, జయంతి, జీఎంటీ కోఆర్డినేటర్ లయన్ విశ్వనాథం, అడ్వైజరీ కమిటీ సభ్యులు కొప్పు లక్ష్మీనారాయణ గౌడ్, చిలకరాజు శ్రీనివాస్, వైద్య బృంద సభ్యులు సైదా, కాశీం, జ్యోతి, సరిత తదితరులు పాల్గొన్నారు.