పల్స్ పోలియో - మన పిల్లల భవిష్యత్తుకు రక్షణ టెలికం బోర్డు మెంబర్ బీజేపీ జిల్లా నాయకులు బైండ్ల కుమార్
పటాన్ చెరు ; పటాన్ చెరు అంబేద్కర్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పోలియో చుక్కల కార్యక్రమానికి హాజరైన టెలికం బోర్డు మెంబర్ బిజెపి జిల్లా నాయకులు బైండ్ల కుమార్ మాట్లాడుతూ 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పక వేయించండిరెండు చుక్కలు - జీవితాంతం రక్షణపోలియో అనేది పిల్లలను జీవితాంతం వికలాంగులుగా మార్చే ప్రమాదకరమైన వ్యాధి. కానీ కేవలం రెండు చుక్కల పోలియో మందుతో దీనిని పూర్తిగా నివారించవచ్చు.పుట్టిన బిడ్డ నుండి 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. ఇదివరకు చుక్కలు వేయించినా సరే, మళ్లీ తప్పక వేయించండి. పోలియో చుక్కలు 100% సురక్షితం, పూర్తిగా ఉచితం.మన గ్రామంలో ఒక్క బిడ్డ కూడా మిస్ కాకూడదు. మీ పొరుగున ఉన్న పిల్లలకు కూడా ఈ విషయం తెలియజేయండి. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వచ్చి చుక్కలు వేస్తారు. అందరూ సహకరించి పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాము.పోలియో రహిత సమాజమే మన లక్ష్యం. ఆరోగ్యవంతమైన పిల్లలే బలమైన భారతదేశానికి పునాది అని అన్నారు