BREAKING
ఉచిత మెగా వైద్య శిబిరం చేరుకులపాడు సర్పంచ్ అభ్యర్థిగా శకుంతలమ్మ నామినేషన్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి. పల్స్ పోలియో - మన పిల్లల భవిష్యత్తుకు రక్షణ టెలికం బోర్డు మెంబర్ బీజేపీ జిల్లా నాయకులు బైండ్ల కుమార్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.. రెండు చుక్కలు జీవితానికి రక్షణ: సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యం లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పల్స్ పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ బొక్క సువర్ణ అంజిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు...గుత్తుల సాయి… ఎన్విడియాకు మరో భారీ షాక్: జెన్సెన్ హువాంగ్ నిష్క్రమణ తర్వాత అకౌంటింగ్ అవకతవకలపై యూఎస్ ఎస్‌ఈసీ దర్యాప్తు! రాచులూర్ లో పల్స్ పోలియో కార్యక్రమం డీసీసీ అధ్యక్షుడిగా ధారాసింగ్ నాయక్‌కు ఏడాది పూర్తి.. పెద్దేముల్ మండల కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి ఎన్.నగరం సర్పంచ్ బరిలో లక్ష్మీదేవమ్మ, గాయత్రి ఎంపీడీవో కార్యాలయంలో వేర్వేరుగా నామినేషన్ల దాఖలు తరలివచ్చిన గ్రామస్థులు, మద్దతుదారులు.. సందడిగా మారిన పరిసరాలు

పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి.

Select Suryaa Now
పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి.

నారాయణఖేడ్ ; నారాయణఖేడ్ పట్టణంలోని నెహ్రూనగర్ కాలనీలో ఆదివారం లయన్స్ క్లబ్ నారాయణఖేడ్ వారి సహకారంతో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలియో వ్యాధి చిన్నారుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకరమైన వ్యాధి అని, ఈ వ్యాధి బారిన పడకుండా చిన్నారులకు ముందస్తు రక్షణ కల్పించడంలో పోలియో చుక్కలు ఎంతో కీలకమని తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకూడదని అన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు రుక్మిణి గోపాల్ రెడ్డి సుబుర్ మాజీ ఎంపిటిసి పండరి రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు చంద్ర శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.