నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
అమీన్ పూర్ ; నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆధ్యాత్మికతతో పాటు ప్రజల ఐక్యతకు దేవాలయాలు ప్రతీకలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.బీరంగూడ డివిజన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట రెయిన్బో మెడోస్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం నిర్మాణ పనులలో భాగంగా ఆదివారం చేపట్టిన స్లాబ్ పనులను ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని బంధంకొమ్ము హనుమాన్ దేవాలయంలో గల ధ్వజ స్థంభం తొడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయాల నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. దేవాలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు కృష్ణ, రాజు, బిజిలీ రాజ్, జగదీష్, శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.