మైనారిటీలకు అండగా నిలుస్తూ పేద విద్యార్థిని, విద్యార్థులకు ఇంటి పెద్ద కొడుకులా ఆదుకుంటున్న వక్స్ బోర్డ్ డైరెక్టర్...... ఇస్మాయిల్ బేగ్
పొన్నూరు మేజర్ న్యూస్:-మైనారిటీల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పేద మైనారిటీ విద్యార్థి చదువు కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...…ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలో ఆపే పరిస్థితిలో ఉన్న విద్యార్థి విషయం తెలుసుకొని వెంటనే స్పందించి సహాయం అందించారు. చదువే పేద విద్యార్థులకు అసలైన ఆస్తి అని, ఆర్థిక కారణాలతో ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
ఎప్పుడూ మైనారిటీలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇస్మాయిల్ బేగ్ చేసిన ఈ సహాయాన్ని స్థానికులు పట్టణ ప్రజలు నాయకులు అభినందించారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్