చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి.
నారాయణఖేడ్ ; నారాయణఖేడ్ పట్టణంలోని హెచ్‌ఆర్ ప్యాలెస్ సమీపంలో నిర్వహించిన మొబైల్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో ఆదివారం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో చుక్కలు వేయించడం ద్వారా చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించవచ్చని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఐదేళ్లలోపు చిన్నారులు ఎవరూ పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్ చౌహన్, పురుషురామ్, సతీష్ సెట్, మాణిక్ ప్రభు సెట్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు