కత్తెర గుర్తుకు ఓటేసి రాజేశ్వరిని గెలిపించండి
- దారపనేని చంద్రశేఖర్ పిలుపు
పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని
తూర్పు కోడిగుడ్లపాడు పంచాయతీ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ బైరెడ్డి జాహ్నవి, ఎంపీటీసీ పువ్వాడి వెంకట లక్ష్మమ్మ, మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు బైరెడ్డి జయరామిరెడ్డి బలపరిచిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి మానం రాజేశ్వరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కనిగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో బరిలో నిలిచిన రాజేశ్వరికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో కనిగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ విస్తృతంగా పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 26న జరిగే పంచాయతీ ఎన్నికల్లో రాజేశ్వరికి కత్తెర గుర్తుపై ఓటు వేసి ఘనవిజయం అందించాలని కోరారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసే అభ్యర్థిని ఆదరించాలని ప్రజల మద్దతుతో రాజేశ్వరిని భారీ మెజార్టీతో గెలిపించాలని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.