BREAKING
డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు. కత్తెర గుర్తుకు ఓటేసి రాజేశ్వరిని గెలిపించండి చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి. నిండు జీవితానికి రెండు చుక్కలు.. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం గ్రామాభివృద్ధే లక్ష్యంగా రేఖ మంజునాథ్ ఇంటింటి ప్రచారం బీరంగూడ గుట్టపై ఆధ్యాత్మిక వైభవం.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం.. గండిగూడెం దుర్గమ్మ, ఎల్లమ్మ, చిత్తరమ్మ దేవాలయాల నిర్మాణాలకు ఎమ్మెల్యే భారీ విరాళం.. బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు మంచం గుర్తుతో ఆశా సుబ్రహ్మణ్యం ప్రచార శంఖారావం చిన్నారుల ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి మైనారిటీలకు అండగా నిలుస్తూ పేద విద్యార్థిని, విద్యార్థులకు ఇంటి పెద్ద కొడుకులా ఆదుకుంటున్న వక్స్ బోర్డ్ డైరెక్టర్...... ఇస్మాయిల్ బేగ్ ఉచిత మెగా వైద్య శిబిరం చేరుకులపాడు సర్పంచ్ అభ్యర్థిగా శకుంతలమ్మ నామినేషన్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి.

గ్రామాభివృద్ధే లక్ష్యంగా రేఖ మంజునాథ్ ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
గ్రామాభివృద్ధే లక్ష్యంగా రేఖ మంజునాథ్ ఇంటింటి ప్రచారం

కాడేపల్లి వినాయక స్వామి ఆలయం వద్ద పూజలు.. గ్రామంలో ఇంటింటి ప్రచారం

గుడుపల్లి మేజర్ న్యూస్:-

 మండలంలోని గుడుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేఖ మంజునాథ్ ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కాడేపల్లి గ్రామంలోని వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తనకు కేటాయించిన మంచం గుర్తుతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అనంతరం కాడేపల్లి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రేఖ మంజునాథ్ మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పిస్తే గ్రామంలో తాగునీరు, రహదారులు, మురుగునీటి కాలువలు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మహిళలు, వృద్ధులు, పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చొరవ తీసుకుంటానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తన మంచం గుర్తుపై ప్రజలు మద్దతు తెలిపి ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ భవాని చంద్రశేఖర్, మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, ఎంపీపీ మీనాక్షి హేమాంబర్ గౌడ్, అమరేష్ ,మాజీ సర్పంచ్ వెంకటేష్, వెంకటేష్, పలువురు ముఖ్య నాయకులు  కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.