మంచం గుర్తుతో ఆశా సుబ్రహ్మణ్యం ప్రచార శంఖారావం
ఒంటిపల్లిలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం
గుడుపల్లి మేజర్ న్యూస్:-
గుడుపల్లి మండలం కుప్పగానీపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆశా సుబ్రహ్మణ్యం ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. శ్రీ ప్రసన్న రాళ్ల గంగమాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తనకు కేటాయించిన మంచం గుర్తుతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తొలిరోజు ఒంటిపల్లి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆశా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పిస్తే గ్రామంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మహిళలు, వృద్ధులు, పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చొరవ తీసుకుంటానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తన మంచం గుర్తుపై ప్రజలు మద్దతు తెలిపి ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ భవాని చంద్రశేఖర్, మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, ఎంపీపీ మీనాక్షి హేమాంబర్ గౌడ్, జిల్లా పార్లమెంట్ మహిళా కార్యదర్శి పద్మ, ఎస్.ఆర్. చంద్రప్ప, మాజీ ఆత్మ చైర్మన్ చంద్రప్ప, కె.టి.ఎం. మంజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్: లెనిన్ గుడిపల్లి మండలం