షంషూర్‌ను గెలిపించండి
పామూరు, మేజర్ న్యూస్ :
- ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన ఎంపీపీ పువ్వాడి
- కప్పు సాసర్ గుర్తుపై ఓటేయాలని విజ్ఞప్తి
పామూరు పట్టణ అభివృద్ధికి ప్రజల మద్దతు అవసరమని ఎన్డీఏ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి షేక్. షంషూర్‌ను గెలిపించాలని ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు ఓటర్లను కోరారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో అభ్యర్థి షంషూర్‌తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే అభ్యర్థికి ప్రజలు అండగా నిలవాలని షంషూర్‌కు అవకాశం కల్పిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టణ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ప్రతి వార్డులో ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు కూటమి నాయకులు సహకరిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థితో పాటు నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని బ్యాలెట్ నమూనా పత్రాలను పంపిణీ చేశారు. కప్పు సాసర్ గుర్తును ఓటర్లకు చూపిస్తూ ఆ గుర్తుపై ఓటు వేసి షంషూర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి షేక్ షంసూర్, టిడిపి మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, ఏఎంసీ చైర్మన్ యారవ రమా శ్రీనివాస్, క్లస్టర్ ఇంచార్జ్ గుంటుపల్లి శ్రీనివాసులు,ఆకుపాటి వెంకటేష్, అంచూరి వెంకటరెడ్డి, పాలపర్తి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.