10 వేల మంది విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్
గుంటూరు : గుంటూరు నగరంలోని అన్ని పాఠశాలలకు చెందిన పదివేల మంది 8, 9 తరగతుల విద్యార్థులకు రెడ్ క్రాస్ మరియు కనెక్ట్ సౌజన్యంతో రక్త పరీక్షలు నిర్వహించి బ్లడ్ గ్రూపింగ్ నిర్ధారించటానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఆదివారం గుంటూరులోని భారతీయ విద్యా భవన్ లో రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. రామచంద్ర రాజు, కనెక్ట్ ప్రతినిధులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, తమ్మా ధనుంజయ రెడ్డి, మేకల రామారావు, ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జె.వి. సుధీర్ కుమార్ తో పాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు కె.ఎన్. రజనీకాంత్, ఎం.సంతోషి కుమారిలు సమావేశమై గుంటూరు నగరంలో రక్తం కొరతను తీర్చడానికి మరియు విద్యార్థులలో రక్తదానం పట్ల అవగాహన, ఆసక్తి కలిగించడానికి బ్లడ్ గ్రూపింగ్ దోహదపడుతుందని భావించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. రామచంద్ర రాజు ప్రసంగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెడ్ క్రాస్11 బ్లడ్ బ్యాంకులు కలిగి వేలాది మందికి నాణ్యమైన రక్తాన్ని అందిస్తున్నాయని తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం అందిస్తుందని, గిరిజన ప్రాంతాలలో సైతం ఉచిత వైద్య సేవలు, మందులను అందిస్తునామన్నారు . కనెక్ట్ కోఆర్డినేటర్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ సేవా తత్పరులు త్రిపురమల్లు అరుణకుమార్ నేతృత్వంలో బ్లడ్ గ్రూపింగ్ ను ప్రభుత్వ పాఠశాల ల్లో ఉచితంగా నిర్వహించి వారికి గుర్తింపు కార్డులను అందజేస్తామని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆయా యాజమాన్యాల సహకారంతో బ్లడ్ గ్రూపింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జె.వి. సుధీర్ కుమార్ ప్రసంగిస్తూ బ్లడ్ గ్రూపింగ్ నిర్ధారణ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తమ సహకారాన్ని అందిస్తారని, సేవా సంస్థల ఉమ్మడి వేదికగా ఏర్పడిన కనెక్ట్ ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమాలలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు.చేయూత ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు తమ్మా ధనుంజయ రెడ్డి ప్రసంగిస్తూ బాలికల్లో 70 శాతం మంది రక్తహీనత సమస్యతో బాధపడుతు న్నారని అందువలన వారు రక్తదాతలుగా మారలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లడ్ గ్రూపింగ్ నిర్ధారణ కార్యక్రమంలో భాగంగా రక్త సహాయ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరిస్తామన్నారు.
సూర్య నాయక్