BREAKING
పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి : డీసీసీ ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా శివకుమార్ నామినేషన్ జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ మెడ్‌వేవ్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం గోనెగండ్ల జడ్పిటిసి బ్యాలెట్ కలకలం.. చెత్త కుప్పలో దొరికిన బ్యాలెట్లు దక్షిణ కొరియాలో యలవర్తి హరిప్రసాద్ కు సీఈఓ క్లబ్ అవార్డు కూటమి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామ అభివృద్ధి గుంతల ‘మయం’.. ప్రయాణం ‘భయం’ శుభ్రమైన రహదారులు, ట్రాఫిక్ జామ్‌లేని నగరం.. అగ్నివీరులకు శుభవార్త ఇవిగో ఆధారాలు... కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా..!? నిశ్చితార్థ వేడుకలో కాబోయే వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. ఒక్క నెలలోనే 16 బిలియన్ డాలర్ల భారం: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో తడిసిమోపెడైన భారత్ ముడిచమురు దిగుమతి బిల్లు! చమురు ధరల మంటకు మించిన పెను ముప్పు: ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం

కూటమి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామ అభివృద్ధి

Select Suryaa Now
కూటమి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామ అభివృద్ధి

కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామ అభివృద్ధి

అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :  అనంతపురము రూరల్ మండలం ఆకుతోటపల్లి గ్రామపంచాయతీ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాగే సరస్వతి గెలుపు కోసం.. టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆదివారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు కేటాయించిన కత్తెర గుర్తుకు, వార్డు సభ్యుల గుర్తులకు ఓటు వేసి గెలిపించాలని.. ఇంటింటికి తిరుగుతూ.. కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అభ్యర్థి రాగే సరస్వతి   గత రెండున్నర సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మరో రెండున్నర సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని గ్రామ అభివృద్ధికి ప్రభుత్వ, ఎమ్మెల్యేల సహకారంతో.. నిధులను రాబట్టుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజలందరూ ఆలోచించి… కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.